ప్రభాస్-నాగ్ అశ్విన్ పై సెన్షేషన్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898’. ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఒక్కో సీన్ ని ఓ రేంజ్లో సరికొత్తగా చూపించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం నాగ్ అశ్విన్ ని కొనియాడటం ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటించగా.. మృణాల్ ఠాకూర్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, శోభన వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు.

చరిత్ర సృష్టించిన కల్కి మూవీని వేరే లెవల్కు తీసుకెళ్లిన నాగ్ అశ్విన్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై  బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో పాన్ ఇండియా స్టార్ ను ఎలా ప్రజెంట్ చేశారో అమితాబ్ ప్రశంసించారు. ఈ స్టోరీ కోసం ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఈ సినిమాను ఫస్టాప్ లో జనాలు అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version