ఆత్మ లేదు, పరమాత్మ లేదు : కొత్త అసోషియేషన్ పై ప్రకాశ్ రాజ్ కామెంట్

మా అసోషియేషన్‌ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌ ఓటమి అనంతరం… టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ రెండు చీలినట్లు… ఇవాళ ఉదయం నుంచి మీడియాలో కథనాలు ప్రసార మవుతున్నాయి. అంతేకాదు.. మా అసోషియేషన్‌ కు ధీటుగా… ఆత్మ పేరుతో మరో అసోషియేషన్‌ ను ప్రకాశ్‌ రాజ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే… ఆ వార్తలపై స్వయంగా ప్రకాశ్‌ రాజే క్లారిటీ ఇచ్చారు.

మా ఎన్నికల్లో గెలిచిన తమ ప్యానెల్‌ సభ్యులు 11 మంది రాజీనామా చేస్తున్నారని.. కానీ మా లోనే కొనసాగుతామన్నారు. కొత్త అసోషియేషన్‌ పెట్టే ఆలోచన తమ కు లేదంటూ కుండ బద్దలు కొట్టారు. ఆత్మ, పరమాత్మ అలాంటి ఆలోచనలే తమ కు లేవని.. అవన్నీ గాలి వార్తలన్నారు ప్రకాశ్‌ రాజ్‌. ఎన్నికల మేనిఫెస్టోను విష్ణు అమలు చేయకపోతే… బయట నుంచి ప్రశ్నిస్తామని హెచ్చరించారు. మాలో రెండు వర్గాలకు చెందిన వారుంటే.. విభేదాలు వస్తాయని.. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.