ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. అక్టోబర్‌ 25 వ తేదీ నుంచి జరిగే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో కేవలం 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఉంటాయని…. అందులో 50 శాతం చాయిస్‌ ఉంటుందని పేర్కొంది సర్కార్‌. ఇంటర్ పరీక్షలు స్టడీ మెటీరియల్ ను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ…   పరీక్షల్లో ఒత్తిడి, భయం లేకుండా ఉండేందుకే ఈ స్టడీ మెటీరియల్ విడుదల చేస్తున్నామని తెలిపారు.

ఈ సారి పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుండే ప్రశ్న లు ఇస్తున్నామని.. అలాగే 50 శాతం ఛాయిస్‌ ఉంటుందన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. నిష్ణాతులతో స్టడీ మెటీరియల్ తయారీ చేయించామని స్పష్టం చేశారు. ఇంటర్ వెబ్సైట్ లో స్టడీ మెటీరియల్ కూడా లభిస్తుందన్నారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ మొదటి సంవత్సరం ప్రాథమిక లెర్నింగ్ మెటీరియల్‌ను tsbie.cgg.gov.in. వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news