మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో ఆయన పార్థీవ దేహాన్ని ఇవాళ ఆర్మీ ఆసుపత్రి నుంచి రాజాజీమార్గ్‌లోని ఆయన అధికారిక నివాసానికి తీసుకురానున్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, సోనియా గాంధీ, రాహుల్, కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2 గం.కు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన గతకొంత కాలంగా ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ప్రణబ్. అయితే ప్రణబ్ ముఖర్జీ 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు. అదేవిధంగా ఆయన మృతి పట్ల ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు సంతాపం తెలిపారు.