రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన ప్రశాంత్ కిషోర్ ?

-

ప్రశాంత్‌ కిషోర్‌.. ఈ పేరు తెలియని వారుండరు. ఎన్నికల వ్యూహకర్తగా.. ప్రశాంత్‌ కిషోర్‌ సక్సెస్‌ కావడమే కాకుండా… మంచి పేరు తెచ్చికున్నారు. రెండు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీకి 2014 లో అఖండ విజయాన్ని తెచ్చిపెట్టిన ఘనుడు ప్రశాంత్‌ కిషర్‌. ఈయన అడుగు పెడితే.. చాలు.. ఎలాంటి పార్టీ అయినా.. ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం. ఇలా బీహార్‌ లో నితీష్‌కు, బెంగాల్‌ లో మమతాకు, తమిళనాడులో స్టాలిన్‌ కు, ఏపీలో జగన్‌ కు పని చేసి.. ఆయా పార్టీలకు అఖండ విజయాలను అందించారు పీకే. అయితే… ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి.. కోరకరాని కొయ్యలా తయారయ్యారు.

అదేంటి రేవంత్‌ రెడ్డికి, పీకేకు ఏం సంబంధం అనుకుంటున్నారా ? ఉంది.. రెండు రోజుల కిందట.. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో మరోసారి ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశం కావడమే.. రేవంత్‌ రెడ్డి శిబిరంలో గుబుల్‌ రేపుతోంది.ఇటీవల ఓ సభలో ప్రశాంత్‌ కిషోర్‌ ను బండ బూతులు తిట్టారు రేవంత్‌ రెడ్డి. అయితే.. ఇప్పుడు.. ప్రశాంత్‌ కిషోరే.. కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా..లేదా.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని నేషనల్‌ మీడియాలో రెండు రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో లేదో కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాత్రం..ఈ పీకే సమావేశం.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రశాంత్‌ కిషోర్‌ తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల వ్యూహకర్తగా.. పనిచేస్తున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మీడియా వేదికగానే ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌ తెలంగాణ రాష్ట్రంలో సర్వేలు చేస్తున్నారని కూడా సమాచారం. ఎలాగైనా.. టీఆర్‌ఎస్‌ పార్టీ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి తీసుకురావాలని… ఎత్తుగడలు వేస్తున్నారు పీకే. ఈ నేపథ్యంలోనే.. ప్రశాంత్‌ కిషోర్‌ పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకేలు ఏమి పీకలేరంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు రేవంత్‌. కాంగ్రెస్‌ పార్టీకి పీకేలు అవసరమే లేదని.. 40 లక్షల మంది ఏకే – 47 లాంటి కార్యకర్తలు ఉన్నారని అన్నారు.

పీకేలు ఏమి పీకలేరంటూ రేవంత్‌ రెడ్డి విమర్శలు చేయగా… అంతకు ముందు.. బీహారీ గ్యాంగ్‌ అని కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని ఐఏఎస్‌, ఐపీఎల్‌ లు అందరూ.. బీహారు నుంచి వచ్చిన వారేనని ఫైర్‌ అయ్యారు. అలాగే.. బీహార్‌ కు చెందిన పీకేను కూడా.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారని విరుచుకుపడ్డారు. ఇన్ని మాట్లాడిన రేవంత్‌ రెడ్డికి.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానమే షాక్‌ ఇచ్చింది. బీహారీ గ్యాంగ్‌ అయిన పీకేతో సమావేశం కావడమే కాకుండా.. అతన్ని పార్టీలోకి కాంగ్రెస్‌ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది.

పీకే… కాంగ్రెస్‌ పార్టీలో చేరుతే.. కచ్చితంగా లాభం చేకూరుతుందని.. సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు. కానీ.. ఈ ఎపిసోడ్‌ రేవంత్‌ రెడ్డికి మింగుడు పడటం లేదు. ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్నట్లు తయారైంది రేవంత్‌ రెడ్డి యవ్వారం. ఒక వేళ.. పీకే.. నిజంగానే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త లేదా పార్టీ కండువా కప్పుకుంటే.. రేవంత్‌ రెడ్డి ఎలా వ్యవహరిస్తారో చూడాలి. అయితే.. దీనిపై టీఆర్‌ఎస్‌ పార్టీ యాక్టివ్‌ అయి.. బీహారీ గ్యాంగ్ డైలాగులతో రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చే ఛాన్స్‌ అయితే ఉంటుంది. కానీ దీనిపై క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news