యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లే. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని ప్రతిష్టాత్మకంగా త్మకంగా నిర్మించనుంది. అధికారికంగా ఈ విషయాలు వెల్లడించనప్పటికీ వెనుక జరిగే వాస్తవం ఇదే. తారక్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తిచేసిన అనంతరం ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించనున్నారు. అయితే ఈ వార్త వచ్చినప్పటి నుంచి తారక్ తో ప్రశాంత్ ఎలాంటి ప్రాజెక్ట్ డిజైన్ చేసాడని అభిమానుల్లో ఓ ఉత్కంఠ నెలకొంది. కేజీఎఫ్ తరహాలోనే భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండొచ్చని ఊహాగానాలొచ్చాయి. కానీ తాజా సమచారం ప్రకారం ప్రశాంత్ , తారక్ తో డిఫరెంట్ వేలో వెళ్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
తారక్ డాన్స్ గ్రేస్ ను కనిపెట్టిన ప్రశాంత్ యంగ్ టైగర్ కోసం అలాంటి నేపథ్యం గల కథనే తీసుకున్నాడని ఓ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే నిజమైతే తారక్ అభిమానులకు పండగే. తారక్ ఎనర్జిటిక్ డాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నందమూరి ఫ్యామిలీలోనే బెస్ట్ డాన్సర్. ప్రస్తుతం డాన్సుల పరంగా ట్రెండింగ్ లో ఉన్న హీరోల్లో రామ్, బన్నీ, ఎన్టీఆర్ మధ్య గట్టిపోటీ ఉంది. ముగ్గరు పోటీ పడి డాన్స్ చేయగల స్టార్లు. డాన్సుల పరంగా బన్నీ, రామ్ కంటే ఎన్టీఆర్ సీనియర్. భారీ శరీరం కలిగినప్పుడు డాన్సుల్లో తుప్పు రేపేవాడు.
సన్నటి కరెంట్ తీగలా ఉన్నా… ఏబీలైన్ జంపర్ లా ఉన్నా డాన్సు అనే సరికి చిచ్చరపిడుగయ్యేవాడు. తారక్ అనతి కాలంలో స్టార్ అవ్వడంలో ఆ డాన్స్ గ్రేసింగ్ కీలక పాత్ర పోషించింది. నటుడిగా కన్నా ముందుగా గుర్తింపు నిచ్చిందే ఆ ఎనర్జీనే. సరిగ్గా ఆ పాయింట్ పట్టుకునే ప్రశాంత్ నీల్ తారక్ తో ఇలాంటి నేపథ్యం గల సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ రాక్ స్టార్ యశ్ తో కేజీఎఫ్ -2 తెరకెక్కిస్తున్నాడు.