విశ్వనగరంగా రూపాంతరం చెందుతోన్న హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగానే మొన్న శామీర్ పేటలోని ఓ ఫాం హౌస్ లో డాక్టర్లు సైతం రేవ్ పార్టీ నిర్వహించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నగరంలోని స్పా, పార్లర్‌లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. దీంతో ఆదివారం సాయంత్రం నాచారం ప్రాంతంలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించగా.. నిబంధనలకు విరుద్దంగా ఎస్సెన్స్ స్పాలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
దాడుల్లో ముగ్గురు నిర్వాహాకు లతో పాటూ.. ఇద్దరు విటులు, మరో ముగ్గురు యువతుల్ని పోలీసులు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రూ. 8వేలు డబ్బు, 6 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్పాలు, మసాజ్ సెంటర్ల పేరుతో ఎవరైనా వ్యభిచారం నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.