సినిమాపై అంచనాలు పెంచేసిన ‘ప్రతిరోజు పండగే’ ట్రైలర్…..!!

-

మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మాతగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ప్రతిరోజు పండగే. ఇటీవల చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం రిలీజ్ అయిన ప్రతిరోజు పండగే ట్రైలర్ ని బట్టి చూస్తుంటే మరొక హిట్ కొట్టేలా కనపడుతున్నాడు.

క్యాన్సర్ వచ్చిన తన తాతయ్యకు మిగిలిన ఆఖరి ఐదు వారలు ఎంతో ఆనందంగా ప్రతిరోజు పండుగలా గడపాలని, తన కుటుంబసభ్యులను అందరినీ ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేలా ఈ సినిమా కథ సాగనుందని ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. తన సినిమాల్లో మంచి ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా చూసుకునే మారుతీ, ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్స్ ని పుష్కలంగా జోడించినట్లు తెలుస్తోంది. టిక్ టాక్ ఏంజల్ అర్న గా హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమాలో నటిస్తోంది.

సత్యరాజ్ హీరోకు తాతయ్యగా నటిస్తుండగా, సీనియర్ నటి ప్రభ నయనమ్మగా నటిస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తుంటే తప్పకుండా సినిమా మొత్తం మంచి పండగలా సాగేలా ఉందని అంటున్నారు వీక్షకులు. ఇక ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తుండడంతో పాటు సినిమాపై విపరీతంగా అంచనాలు కూడా పెంచేసిందని చెప్పాలి. ఇక సినిమా సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో రేపు రిలీజ్ తరువాత సినిమా తప్పకుండా సక్సెస్ సాధించి తీరుతుందని యూనిట్ ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. మరి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news