Tokyo Olympics: ఆర్చ‌రీ తొలి రౌండ్‌లో ప్ర‌వీణ్ జాద‌వ్ సూప‌ర్ విక్ట‌రీ

-

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో మన దేశ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా ఇండియా అర్చరీ ఆటగాడు ప్రవీణ్‌ జాదవ్‌ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. టోక్యో ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్‌ లో సూపర్‌ విక్టరీ కొట్టాడు ప్రవీణ్‌ జాదవ్‌.

ప్రపంచ మేటి రెండో ర్యాంక్‌ ఆటగాడు గాల్సన్‌ బాజజోపోవ్‌ ను ఓడించాడు. 6-0 స్కోర్‌ తేడాతో గాల్సన్‌ పై సంచలన విజయం సాధించాడు ప్రవీణ్‌ జాదవ్‌. రష్యాన్‌ ఒలింపిక్‌ కమిటీ కి చెందిన గాల్సన్‌ ను అతి సులువుగా ప్రవీణ్‌ జాదవ్‌ ఓడించి చరిత్ర సృష్టించాడు. ఇక తదుపరి రౌండ్‌ లో ప్రపంచ మేటి ప్లేయర్‌, నెంబర్‌ వన్‌ ఆటగాడు బ్రాడీ ఎలిసన్‌ తో ప్రవీణ్‌ జాదవ్‌ తలపడనున్నాడు. కాగా.. అటు తెలుగు తేజం పీవీ సింధు మరో గెలుపును సొంతం చేసుకుంది. ఈ రోజు గ్రూప్‌ జె నుంచి మరో విజయం సొంతం చేసుకుని ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ కు ఎంట్రీ ఇచ్చింది పీవీ సింధు.

Read more RELATED
Recommended to you

Exit mobile version