సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ప్రవీణ్ సూద్‌కు కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పదవీకాలాన్ని పొడిగించింది. కొత్త డైరెక్టర్ ఎంపికపై సర్వపక్ష ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయనకు పొడిగింపు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయానికి అప్పాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదివరకు ఆయన పదవీకాలం ఈ నెల 24తో ముగియాల్సి ఉంది.
1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, 1989లో మైసూరు జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన సేవల్ని ప్రారంభించారు. అనంతరం బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో ఎస్పీగా, తరువాత బెంగళూరులో డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. అనుభవం , నిష్ఠతో పోలీసు విభాగంలో తనదైన ముద్ర వేసిన సూద్, సీబీఐ వంటి కీలక సంస్థను మరో సంవత్సరం ముందుండి నడిపించనున్నారు.