ప‌బ్‌జి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాకు ప్రి-రిజిస్ట్రేష‌న్లు షురూ..!

-

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌బ్‌జి మొబైల్ ప్రియుల‌కు శుభ‌వార్త‌. గ‌తేడాది కేంద్రం ప‌బ్‌జి మొబైల్ యాప్‌ను బ్యాన్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆ యాప్ మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తుందా ? అని ఆ గేమ్ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు ఆ గేమ్ డెవ‌ల‌ప‌ర్ కంపెనీ క్రాఫ్ట‌న్ శుభ‌వార్త చెప్పింది. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట ఆ గేమ్‌ను భార‌త్‌లో లాంచ్ చేస్తున్న‌ట్లు గ‌త నెల‌లో లీక్‌లు ఇచ్చింది. అందులో భాగంగానే తాజాగా గేమ్‌కు గాను ప్రీ-రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభించారు.

pre-registrations started for battlegrounds mobile india

ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు క్రాఫ్ట‌న్ కంపెనీ పేరు మార్చి బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా భార‌త్‌లో లాంచ్ చేయ‌నుంది. ఈ విష‌యం ఇక అధికార‌క‌మే అయింది. ఎందుకంటే ఈ గేమ్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్ర‌స్తుతం ప్రి-రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభించారు. దీంతో ఈ గేమ్ లాంచింగ్ ఇంక లాంఛ‌న‌మే కానుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ గేమ్‌ను జూన్ 10న భార‌త్‌లో లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది. కానీ గేమ్‌కు ప్రి-రిజిస్ట్రేష‌న్ల‌ను మాత్రం ప్రారంభించారు. దీంతో ప‌బ్‌జి ప్రియులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రి-రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం కాగా త్వ‌ర‌లోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ గేమ్‌ను లాంచ్ చేయ‌నున్నారు. ఇక ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ప్లే స్టోర్‌లోకి వెళ్లి అందులో గేమ్‌కు గాను ప్రి-రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. దీంతో గేమ్ లాంచ్ అవ‌గానే దాన్ని ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

కాగా బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు ప్రీ-రిజిస్ట‌ర్ చేసుకునే వారికి ప‌లు స్పెష‌ల్ రివార్డుల‌ను కూడా అందివ్వ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే రెకాన్ మాస్క్‌, రెకాన్ ఔట్‌ఫిట్‌, సెల‌బ్రేష‌న్ ఎక్స్‌ప‌ర్ట్ టైటిల్‌, 300 ఏజీ వంటి రివార్డుల‌ను అందిస్తారు. అలాగే ఓ ప్రి-రిజిస్ట్రేష‌న్ గిఫ్ట్ కూడా అందుతుంది. దాన్ని గేమ్ లాంచ్ అయిన‌ప్పుడు గేమ్‌లోకి వెళ్లి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news