ఆకట్టుకోలేకపోయిన ‘రాధేశ్యామ్’.. ప్రభాస్ నెక్స్ట్ మూవీస్‌పై వేణుస్వామి జోస్యం..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద ఈ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయింది. కోట్ల రూపాయలు ఖర్చు బెట్టి మూవీ యూనిట్ పడ్డ కష్టానికి అనుకున్న ఫలితంగా రాలేదు. కాగా, ఈ ఏడాది ఇలా ఉందని ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ అన్ని కూడా అంచనాలకు మించి ఉంటాయని ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు అంటున్నారు.

తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సర యుగ ఆది (ఉగాది) ప్రారంభమయిన నేపథ్యంలో ఈ ఏడాది అందరి జీవితాలు బాగుండాలని పంచాంగకర్తలు ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే పలువురు జ్యోతిష్య ప్రముఖులు పంచాంగ శ్రవణం చేసి భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రిడక్షన్స్ చెప్పి పాపులర్ అయిన వేణుస్వామి ప్రభాస్ జాతకంపైన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, స‌మంత విడి పోతారని గతంలోనే వేణుస్వామి చెప్పిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాల గురించి ఇలా మాట్లాడారు. ప్రభాస్ తో మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకునే ప్రొడ్యూసర్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు. ప్రభాస్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తొ కొడతాయని, దాంతో నిర్మాతలు తీవ్రనష్టాల్లో కూరుకుపోతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు విన్న ప్రభాస్ అభిమానులు వేణుస్వామిపైన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. వేణుస్వామి చెప్పిన జాతకం నమ్మాల్సిన అవసరం లేదని, తాను హైలైట్ అవ్వడం కోసమే వేణుస్వామి అలా చెప్తారని అంటున్నారు.

ప్రభాస్ ప్రజెంట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తు్న్నారు. ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి తర్వాత ‘స్పిరిట్’ ఫిల్మ్ చేయబోతున్న ప్రభాస్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితోనూ ఓ పిక్చర్ చేయబోతున్నారు. చూడాలి మరి.. ఈ చిత్రాల విజయం ఎలా ఉండబోతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version