నెల‌లు నిండ‌కుండానే ప్ర‌స‌వం.. శిశువుల జ‌న‌నాలు.. ఎదుర్కొనే స‌మ‌స్య‌లు..!

-

ప్రెగ్నెన్సీ 37వ వారం పూర్తయిన తర్వాత శిశువు జన్మిస్తే దానిని ప్రీటెర్మ్ బర్త్ అంటారు ఆ బేబీ ని ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక కోటి యాభై లక్షల ప్రీమెచ్యూర్ బేబీస్ వుంటారు. అంటే పది మందిలో ఒకరు ప్రెగ్నెన్సీకి ముందే జన్మిస్తారని 2018లో WHO వెల్లడించింది. అయితే అదే సమయం లో కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవుతాయి.

ప్రతి సంవత్సరం ఒక మిలియన్ మంది శిశువులు ఇలా చనిపోతున్నారు. వందలో 13 మంది ప్రిమెచ్యూర్ బేబీస్ మన భారతదేశంలో జన్మిస్తున్నారు. అయితే తొమ్మిది నెలలకు ముందే శిశువులు జన్మిస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయని చూద్దాం..!

డబ్ల్యూహెచ్ఓ మొత్తం వీటిని మూడు కేటగిరీలుగా విభజించింది:

ముప్పై రెండు వారాల నుంచి 37 వారాల వరకు జన్మించిన వాళ్ళని లేట్ ప్రీటెర్మ్. రెండవది 28 వారాల నుంచి 32 వారాల మధ్య లో జన్మించిన వాళ్ళు మోర్ ప్రీ టర్మ్. మూడవది 28 వారాల కంటే ముందుగా జన్మించిన వాళ్ళు. వాళ్ళని మోర్ ప్రీ టర్మ్. లేట్ ప్రీ టర్మ్ లో జన్మించిన వాళ్లకే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి నార్మల్ అయిపోతాయి. అయితే 28 నుంచి 32 వారాల మధ్య లో జన్మించిన శిశువు కి ఊపిరి తీసుకోవడంలో కష్టమవుతుంది పైగా వాళ్లు చాలా బలహీనంగా ఉంటారు.

దీని కారణంగా వాళ్ళని NICU లో పెడతారు. పైగా 28 వారాల కంటే ముందు జన్మించిన శిశువు బతకడం చాలా కష్టం. ఒకవేళ వాళ్ళు బతికినా శిశువులు శారీరకంగా బలహీనంగా ఉంటారు మరియు శారీరకంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎర్లీ డెలివరీ వల్ల కలిగే ఇబ్బందులు డబ్ల్యూహెచ్వో చెప్పిన దాని ప్రకారం చూస్తే…ఎవరికైనా ఈ సమస్య రావచ్చు కానీ కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి.

అవి ఏమిటి అంటే..? గర్భవతి స్త్రీ ల సెర్విక్స్ నార్మల్ కంటే చిన్నగా ఉన్నా ఈ సమస్య వస్తుంది లేదు అంటే యుటెరస్ లేదా ప్లాసెంటా లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఈ సమస్య వస్తుంది. ఏవైనా డ్రగ్స్ తీసుకోవడం లేదు అంటే ధూమపానం చేయడం వల్ల కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో హై బ్లడ్ ప్రెషర్ లేదా డయాబెటిస్ వంటివి వున్నా కూడా ఈ సమస్య రావచ్చు లేదు అంటే సడన్ బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ లో అయినా కూడా ఈ సమస్య వస్తుంది. గర్భవతి అయిన స్త్రీ వయసు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ సమస్య రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news