ఓటిటి లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తున్న “ప్రేమవిమానం” మూవీ!

-

కథ బాగుండి స్క్రీన్ ప్లే లో కాస్త మ్యాజిక్ చేయగలిగితే చాలు ఎంత చిన్న సినిమా అయినా హిట్ కొట్టాల్సిందే. తాజాగా ఒక యంగ్ హీరో సినిమా ఓటిటి లో రికార్డ్ వ్యూస్ తో దూసుకువెళుతోంది. ఇటీవల మ్యాడ్ అంటూ థియేటర్ లలో దర్శనం ఇచ్చి సాలిడ్ హిట్ కొట్టిన సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ మరో హిట్ ను తనఖాతాలో వేసుకున్నాడు. పాత కథనే మంచి కామెడీ తో లాజిక్కులతో రాసుకున్న దర్శకుడు సంతోష్ కటా ఓటిటిలో “ప్రేమవిమానం” ను రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్ కు జోడీగా శాన్వి మేఘన హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. ఈ సినిమాను జీ5 లో రిలీజ్ చేసిన చిత్ర బృందం… ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ను చూసి చాలా సంతోషంగా ఉంది.. ప్రేక్షకులు సైతం ఇప్పటి వరకు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సక్సెస్ చేశారు.

ఇక ఈ సినిమాలో సీన్ లు సైతం రీల్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కుర్ర హీరో వరుసగా రెండు సినిమాలను హిట్ కొట్టి నిర్మాతల కన్ను తనపైన పడేలా చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news