అయ్య బాబోయ్.. ఈ పెళ్లి కానుక లు చూస్తే ఆశ్చర్యపోతారు..?

పెళ్లి జరిగినప్పుడు కానుకలు పెట్టడం మామూలుగా జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. తనకి కాబోయే అల్లుడికి భారీగా కానుకలు సమర్పించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు వధువు తండ్రి. బాగా ధనవంతుల పెళ్లి జరిగింది అంటే ఇక ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటివరకు మీరు ఎంతోమంది ధనవంతుల పెళ్లిళ్లు చూసే ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన పెళ్లి, పెళ్లి కి పెట్టిన కానుకలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.

ఏకంగా తమ కూతురి పెళ్లి ని తరతరాల పాటు గుర్తుండిపోయేలా చేయాలనుకున్న తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు అందుకు తగ్గట్లుగానే కానుకలు సమర్పించుకున్నాడు. తరతరాలు గుర్తుండిపోయేలాగానే కానుకలు ఇచ్చాడు ఓ ఇక్కడ రాజకీయ నాయకుడు. రెండు కిలోల నగలు, రెండు బైక్స్, ఒక కారు. ఒక ట్రాక్టర్, బియ్యం బస్తాలు పశువులు మేకలు సహా ఇంకా ఎన్నో కానుకలు కూడా సమర్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.