నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ని రాష్ట్రపతి రామనాద్ కోవింద్ తిరస్కరించారు. క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకోగా దాన్ని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించారు. దీనితో అతని అభ్యర్ధన రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. ఆయన కూడా క్షమాభిక్ష పిటీషన్ ని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఉరి తీయడం దాదాపుగా ఖరారు అయిపోయింది.
అయితే ఎప్పుడు ఉరి తీస్తారు అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 22 న ఉరి తీస్తారని భావించినా క్షమాభిక్ష పిటీషన్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. రాష్ట్రపతి తిరస్కరించిన తర్వాత 14 రోజులకు గాను ఉరి తీసే అవకాశం ఉంటుంది. దీనితో ఉరి ఫిబ్రవరిలో పడే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంగా మారింది ఈ వ్యవహారం.