ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. శనివారం ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడిని అపాయింట్మెంట్ కూడా దక్కినట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. శనివారం ఢిల్లీలో ఉండి సాయంత్రం లేదా, ఆదివారం ఉదయం ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే జగన్ ఢిల్లీ వెళ్ళడానికి ప్రధాన కారణం రాజధాని తరలింపు విషయంపై కేంద్రానికి చెప్పడానికే అని అంటున్నారు. ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకు రాజధాని తరలింపు ఏ విధంగా ఉండబోతుంది, తన ఆలోచన ఏంటీ అనేది వివరించడానికే అంటున్నారు.
అదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కమిటీల నివేదికలను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. అదే విధంగా విభజన హామీలపై కూడా ప్రధానికి పలు విజ్ఞప్తులు చేసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.