ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ రాజధాని అమరావతి పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 2న ఆయన అమరావతి రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిపాడ్ వద్దకు వెళతారు.అక్కడి నుంచి ప్రధాన వేదిక వద్దకు 1.1 కి.మీ మేర రోడ్డు షోలో పాల్గొంటారు.
ఇది 15 నిమిషాల పాటు ఉంటుంది.3.45 టు 4 వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు.సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరగనుంది.అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం సభలో ప్రసంగిస్తారు. 5.10 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.5.20కి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.