ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలు, లోన్ యాప్ వేధింపుల గురించి నిత్యం ప్రజలకు అవగాహన కల్పించే ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జానార్ మరోసారి తన ఎక్స్ హ్యాండిల్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘పిచ్చి పలు రకాలు. వెర్రి వేయి రకాలు.. అంటే ఇదే’ ట్యాగ్ లైన్‌తో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.అందులో ఓ యువకుడు తన ఫ్రెండ్‌కు గంజాయి ఇచ్చి తాగుమంటాడు. తాగాక అతను 2వేల ఏళ్ల కిందట తనను రెండువేల మంది చంపారని.. వారందరినీ ఇప్పుడు తాను చంపుతానని యాక్ట్ చేశాడు. ఇలా మత్తుకు బానిసై ఎంతో మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. మత్తు సంబంధించిన వీడియోలు చేస్తూ ఎం సాధించాలని అనుకుంటున్నారని వీసీ సజ్జనార్ వారి మీద మండిపడ్డారు. రీల్స్ పిచ్చికి బానిసైన ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
"పిచ్చి పలు రకాలు.. వెర్రి వేయి రకాలు".. సజ్జనార్ ట్వీట్
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా? అంటూ 'ఎక్స్' వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్
యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్‌పై వీడియోలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని… pic.twitter.com/zeDlpgwKYu
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2025