షాకింగ్ : ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ హ్యాక్.. బిట్ కాయిన్ కొనాలంటూ..

-

దేశ ప్ర‌ధాని నరేంద్ర మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్ ను కొంత మంది అగంత‌కులు హ్యాక్ చేశారు. అంతే కాకుండా ప‌లు ట్వీట్ ల‌ను కూడా చేశారు. బిట్ కాయిన్ ను దేశం లో లీగ‌ల్ చేశామ‌ని.. అంద‌రూ కూడా బిట్ కాయిన్ కొనుగోలు చేయాల‌ని కూడా ట్వీట్ చేశారు. అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రి కి 500 బిట్ కాయిన్ ల‌ను పంచ‌తున్నామంటూ ఒక లింక్ ను సైతం పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఇది దేశాన్ని క‌ల‌క‌లం రేపుతుంది.

కాగ ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్ ను ఈ రోజు తెల్ల వారు జామున 2 గంట‌ల ప్రాంతం లో హ్యాక్ కు గురి అయిన‌ట్టు తెలుస్తుంది. దాదాపు గంట కు పైగా ప్ర‌ధాని మోడీ ట్వీట్ట‌ర్ అకౌంట్ హ్యాక‌ర్స్ చేతి లో నే ఉంద‌ని తెలుస్తుంది. ప్ర‌ధాని ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ కు గురి అయింద‌ని పీఎంవో వ‌ర్గాలు ఉదయం 3 గంట‌ల ప్రాంతంలో గుర్తించారు. వెంట‌నే ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ అకౌంట్ ను పీఎంవో వ‌ర్గాలు రీ స్టాట్ చేసాయి. అలాగే హ్యాక్ కు గురి అయిన సమ‌యం లో ఎవ‌రికి అయినా.. మెసేజ్ వ‌స్తే వ‌దిలేయాల‌ని పీఎంవో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news