ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు కి ప్రధాని మోదీ ఫోన్

-

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జగ్గీవాసుదేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. దీనికి ‘నాపై మీరు చూపిన ప్రేమకు ధన్య వాదాలు’ అంటూ సద్గురు రిప్లై ఇచ్చారు.

కాగా, ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news