ఏఆర్ రెహ్మన్ తో వేదికను పంచుకోవడం నమ్మశక్యంగా లేదు : రామ్ చరణ్

-

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఓ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈరోజు జరిగిన RC16 పూజా కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ…జాన్వీ కపూర్ తో తాను ఓ మూవీ చేయాలని చాలా మంది కోరుకున్నారని రామ్ చరణ్ అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే మూవీతో ఆ కల నెరవేరనుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఏఆర్ రెహ్మన్తో వేదికను పంచుకోవడం తనకు నమ్మశక్యంగా లేదని అన్నారు డైరెక్టర్ సుకుమార్కు బెస్ట్ పర్సన్ బుచ్చిబాబుతో వర్క్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ నటించనున్నట్లు తెలుస్తోంది.RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా సినిమా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news