ఈ నెల 5న హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోడీ

-

భార‌త్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైద‌రాబాద్ కు రానున్నారు. శ‌నివారం ప్ర‌త్యేక విమానంలో ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ కు చేరుకుంటారు. ఈ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీ రెండు కార్య‌క్ర‌మాల్లో పాల్గొననున్నారు. శ‌ని వారం మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానం ద్వారా హైద‌రాబాద్ కు మోడీ చేరుకుంటారు. అనంత‌రం ప‌టాన్ చెరు స‌మీపంలో గ‌ల ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల్గొంటారు. అనంత‌రం రంగ రెడ్డి జిల్లాలో ముచ్చింతల కు చేరుకుంటారు.

కాగ రంగా రెడి జిల్లాలోని ముచ్చింతల్ లో ఇటీవ‌ల స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. కాగ ముచ్చింతల్ స‌మ‌తా మూర్తీ విగ్ర‌హాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించ‌నున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ పాల్గొంటారు. దీని త‌ర్వాత శ‌నివారం రాత్రే.. ప్ర‌ధాని మోడీ తిరిగి ఢిల్లీకి ప్ర‌త్యేక విమానం ద్వారా ప్ర‌యాణం అవుతారు.

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి పీఎంవో పంపించింద‌ని తెలుస్తుంది. దీంతో ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఎలాంటి అవాంఛ‌నియ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news