దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈరోజు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్, ఇతర ముఖ్య పీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూలంకుశంగా చర్చించారు.
అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న వ్యాక్సిన్ కొరత, ఆక్సిజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంగా పనిచేయాలని ప్రధాని తెలిపారు. వైద్య రంగానికి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని చెప్పారు. ఇక కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో లాక డౌన్ పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అయితే రాష్ట్రాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ప్రధాని తెలిపారు.