సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ వరకు ఎదిగారు రజినీకాంత్. అవమానించిన వాళ్లతోనే చప్పట్లు కొట్టించుకున్నారు. అలాంటి సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు… ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు సినీ ప్రియులు అలాగే సీనియర్ నటీనటులు.

ఇక 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు రజినీకాంత్ కు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబడుతోంది.