మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితమే ఈ-రూపీ విధానాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోడి. ఈ సందర్భంగానే..ప్రధాని నరేంద్ర మోడీ ఈ-రూపీ విధానాన్ని ప్రారంభించారు.
ఈ ఈ-రూపీ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీల కు ప్రోత్సాహం లభించనుంది. అంతేకాదు డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న.. నేపథ్యంలోనూ.. ఈ-రూపీ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది.
వాడే విధానం :
ఈ రూపీ చెల్లింపులో నగదు చెల్లింపుల క్యూ ఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ల ద్వారా లబ్ధిదారుల మొబైల్ ఫోన్ కు పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం 8 బ్యాంక్ లలో ఈ రూపీ కొనసాగనున్నాయి. డిజిటల్ లావాదేవీలను మరింత వేగం చేసే ప్రక్రియలో భాగంగా… ఈ విధానాన్ని కేంద్రం తీసుకొస్తున్నట్లు చెప్పింది.