తెలంగాణలో వరుసగా నాలుగోసారి 10వ తరగతి పేపర్ లీక్ !

-

తెలంగాణలో వరుసగా నాలుగోసారి 10వ తరగతి పేపర్ లీక్ అయింది. 4 రోజుల్లో నాలుగో సారి పేపర్ లీక్ అయిందని సమాచారం అందుతోంది. పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా విఫలమైన విద్యాశాఖ… బాధ్యుల పై రివెంజ్ తీర్చుకుంటోంది. అటు జుక్కల్‌లో 10వ తరగతి గణిత ప్రశ్నాపత్రం లీక్ అయి.. ఏడుగురు అరెస్ట్ అయ్యారు. నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్ పేపర్ లీక్ ఘటనలు మరువక ముందే మరోసారి 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందట.

10th class

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి గణితం పేపర్ లోని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. వాటికి సంబంధించిన సమాధానాల చిటీలు కూడా సెంటర్ లోని విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. పేపర్ లీక్ సంబంధించిన వార్త అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా విచారణ జరిపిన అధికారులు నిజమని నిర్ధారించారు. ఐతే 4 రోజుల్లో నాలుగో సారి పేపర్ లీక్ అయిందని సమాచారం అందుతోంది. దీనిపై ఇన్క్ వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version