సొంత రాష్ట్రంలో ప్రధాని పర్యటన..సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోడీ!

-

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు..రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోడీ..అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని.. కేవడియా-అహ్మదాబాద్‌ మధ్య సీప్లెయిన్‌ సేవలను ప్రారంభించనున్నారు.

మార్చిలో లాక్ డౌన్ విధించిన తర్వాత.. మోడీ తొలిసారిగా రెండు రోజుల పర్యటన కోసం సొంత రాష్ట్రం గుజరాత్‌కు వచ్చారు..ముందుగా తన స్వగ్రామమైన అహ్మదాబాద్ కు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు..తర్వాత గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్, గుజరాతీ సినిమా సూపర్ స్టార్ నరేశ్ కనోడియా, తన సంగీత కారుడు సోదరుడు మహేష్ కనోడియాలకు నివాళులర్పించారు ప్రధాని..కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు..ఆ తర్వాత కేవాడియా చేరుకుని అక్కడ ఆరోగ్య వన్..ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. ఉద్యానవనం మొత్తం తిరిగి పరిశీలించారు. మోడీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం విజయ్ రూపాని ఉన్నారు. పార్కు విశేషాలను వారు ప్రధానికి వివరించారు అధికారులు..చిల్డ్రన్‌ న్యూట్రిషన్‌ పార్క్‌ను ప్రారంభించి అక్కడి న్యూట్రీ రైలులో కాసేపు సరదాగా ప్రయాణించారు..భారత సంస్కృతి సంప్రదాయాలు, చేనేత కళలకు అద్దం పట్టే ఏక్తా మాల్‌ను ప్రారంభించారు. అక్కడి కళాకృతులను వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version