హైదరాబాద్ లో నిన్న మళ్ళీ 11 మిస్సింగ్ కేసులు

-

హైదరాబాద్లో రోజు రోజుకి మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత నాలుగు రోజుల్లో రెండు వందల మిస్సింగ్ కేసులు నమోదైనట్టు లెక్కల్లో ఉండగా నిన్న ఒక్క రోజే 11 మంది మళ్ళీ మిస్ అయ్యారు. నిన్న పదకొండు మంది మిస్సయినట్టు పోలీసులకి ఫిర్యాదులు అందాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అదృశ్యం కాగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలు మిస్సయ్యారు.

అలానే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత, ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు. వివిధ కారణాలతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఈ మిస్సింగ్ కేసుల మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టి సెర్చ్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్కరు.. ఒక్కో కారణంతో మిస్సవుతున్నట్టు వారు భావిస్తున్నారు. వరుసగా బయటపడుతున్న కేసుల్ని చూస్తే ఒక్క దానికి మరో దానికి అస్సలు సంబంధం లేకుండా పోయింది. దీంతో పోలీసులకి ఈ కేసులు తలనొప్పిగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version