ప్రిన్సిపాల్, టీచర్ కామకేళి.. గ్రామస్తుల ఎంట్రీతో రాసలీలల్లో ట్విస్ట్..

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఏ చోటేతేనేం అన్నట్లుగా.. వ్యవహరిస్తున్నారు. దేవాలయం లాంటి పాఠశాలలో కన్నుమిన్ను కానక ఓ ప్రిన్సిపాల్, టీచర్ చేసిన నిర్వాకం ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చను తీసుకువచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలలో రాజేష్ అనే వ్యక్తి పాల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే స్కూల్ లో పనిచేసే ఓ టీచర్ తో రాజేష్ పాల్ కి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే వీరిద్దరూ తమ రాసలీలలు సాగించడానికి పాఠశాల స్టోర్ రూం ను అడ్డాగా మార్చుకున్నారు.

ఇక ఇంకేముంది రోజు స్కూల్ కి రావడం.. అందరి కన్నుగప్పి స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఇద్దరూ కామకేళిలో మునిగి తేలడం.. వీళ్ళ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఓ రోజు వీరి తతంగమంతా రికార్డ్ చేశారు. అంతే కాకుండా వారి రాసలీలను సోషల్ మీడియాలో వదిలారు. దీంతో సదరు ప్రిన్సిపాల్ గ్రామస్తుల్లో ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆ వీడియో తొలగించాలని, అవసరమైతే డబ్బులు ఇస్తానంటూ మాట్లాడిన ఆడియో కూడా వైరల్ గా మారింది. ఈ విషయం విద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version