కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఊహించని షాక్ ఇచ్చింది టీఆర్‌ఎస్ పార్టీ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై టిఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసు ఇచ్చింది. “పారా బాయిల్డ్ రైస్” ఎగుమతులు విషయంలో సభను తప్పుదోవ పట్టించారని.. రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు నోటీసులు ఇచ్చారు.
భారత ప్రభుత్వం “వెబ్ సైట్” ప్రకారం అనేక దేశాలకు “పారా బాయిల్డ్ రైస్” ఎగుమతి చేస్తున్నారని నోటీసులో పేర్కొన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు… రాజ్యసభ లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ కు వ్యతిరేకంగా “సభాహక్కుల ఉల్లంఘన నోటీసు” ఇచ్చింది.
సభను తప్పుదోవ పట్టించారని కేంద్ర మంత్రి కి వ్యతిరేకంగా రాజ్యసభ లో 187 నిబంధన కింద “ప్రివేలేజ్ మోషన్ నోటీస్” ఇచ్చారు టిఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, లింగయ్య యాదవ్. లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని నోటీసులలో పేర్కొన్నారు టిఆర్ఎస్ ఎంపీలు.