కన్ను కొట్టిన పాప గుండెలదరగొట్టింది..

ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క వీడియోతో మొత్తం సోషల్ మీడియాని ఊపేసింది. సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఆమెకి ఫాలోవర్లు విపరీతంగా పెరిగారు. ఆమె కన్ను కొడితే సినిమాలో హీరో పడిపోయాడా లేదా అన్నది పక్కన పెడితే, బయట జనాలంతా పడిపోయారు. కుర్రాళ్ళైతే మరీనూ. వెంటనే ఫోన్లు తీసి మరీ సోషల్ మీడియాలో ఫాలో అవడమ్ మొదలెట్టారు. అందుకే ఆమె ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది.

https://www.instagram.com/p/CGMozIHAlQf/

ఐతే అప్పుడు కన్ను కొట్టిన పాప ఇప్పుడు గుండెలు అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్లతో టచ్ లో ఉండే ప్రియా ప్రకాష్ వారియర్, ఫోటోలని పంచుకుంది. పెద్ద కళ్ళు, చిన్న బొట్టు, మెడలో బంగారు ఆభరణాలు వేసుకుని మహారాణిలా నిల్చుని ఉంది. కన్ను గీటిన పాప తన అందంతో కుర్రకారు గుండెలు అదరగొడుతుంది.