ప్రియదర్శి బలగం ట్రైలర్‌ రిలీజ్‌.. మస్తుంది..

-

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఇప్పటికే సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గానే దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించాడు. చిన్న సినిమాలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న మొదటి సినిమా బలగం. ప్రియదర్శి – కావ్య జంటగా రూపొందిన సినిమానే ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్లో హర్షిత్ రెడ్డి – హన్షిత నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నారు.

 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ ప్రాంతంలో .. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ.. హీరో బాకీతో ముడిపడిన అతని నిశ్చితార్థం .. ఆయన టెన్షన్ పడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పల్లె అందాలు .. అక్కడి మనుషుల ఆత్మీయత .. వాళ్ల మాట తీరును ప్రతిబింబించేదిగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. ఇంతవరకూ తన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని దిల్ రాజు చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version