Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’ అప్‌డేట్..సారథి స్టూడియోలో పవన్ కల్యాణ్‌తో ప్రియదర్శి

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా కోసం పవర్ స్టార్ అశేష అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వీరిరువురి కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్ ’పిక్చర్ రికార్డులన్నిటినీ తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడొస్తుందా? అప్ డేట్ ఏంటి? అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అప్ డేట్ అయితే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చూసేందుకు హైదరాబాద్ అమీర్ పేట సారథి స్టూడియోకు వచ్చినట్లు తెలుస్తోంది.

దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ తో ఉన్నారు. ఈ సమయంలోనే స్టూడియోలో కమెడియన్ ప్రియదర్శి ఉన్నారు. ఆయన పవన్ కల్యాణ్ అభిమాని. కాగా, తాను పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం కల్పించిన దర్శకుడు హరీశ్ శంకర్ కు థాంక్స్ చెప్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టాడు. సదరు ట్వీట్ లో తను పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటోతో పాటు ఆటోగ్రాఫ్ తీసుకున్న ఫొటో షేర్ చేశాడు.

తనకు పవన్ కల్యాణ్ తీసిన ‘జానీ’ సినిమా చాలా ఇష్టమని, అది తనకు ఎంతో నచ్చిందన్న విషయం ఎట్టకేలకు పవన్ కల్యాణ్ కు చెప్పానని ప్రియదర్శి పేర్కొన్నాడు. హరీశ్ శంకర్ అన్న వలన పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం తనకు లభించిందని చెప్తూ హరీశ్ శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దర్శకులు హరీశ్ శంకర్. పవన్ కల్యా్ణ్ ను కలిసి ఆయనతో మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతని వివరించారు ప్రియదర్శి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news