తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన ప్రియమణి..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ప్రియమణి తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక తన భర్తతో ప్రియమణికి గొడవలు వచ్చాయని దీంతో ఇద్దరు కలిసి ఉండలేరని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. ఈ వార్తలకు ప్రియమణి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చేసిందని చెప్పవచ్చు.

అయితే ప్రియమణి ఇలాంటి పుకార్లకు స్పందించకుండా సైలెంట్ గా ఉండడంతో ఈ వార్తలు మరింత పాపులర్ గా మారాయి. త్వరలోనే ప్రియమణి ఈ వార్తలు కనుమరుగవుతాయని తెలియజేసింది. తాజాగా దీపావళి వేడుకలను తమ కుటుంబంతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంది ప్రియమణి. అయితే ఇందులో ముస్తఫా రాజ్ లేరని.. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా ప్రస్తుతం తన భర్త అమెరికాలో ఉన్నారని అందుచేతనే తమ ఫ్యామిలీ ఫోటోలో కనిపించలేదని తెలియజేసింది. ఇక అంతే కాకుండా అలా పెట్టిన పోస్టుల్లో తను ముస్తఫా ను చాలా మిస్ అవుతున్నట్లుగా ప్రియమణి తెలియజేసింది.

2017లో ప్రియమణి, ముస్తఫా రాజ్ కు వివాహమైంది ముస్తఫాకు ఇది రెండవ వివాహం. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ప్రియమణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా మొన్నమధ్య ముస్తఫా మొదటి భార్య కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది.ముస్తాఫా తనను తన పిల్లలను అసలు పట్టించుకోవడంలేదని గొడవ చేయడం జరిగింది. దీంతో ఆ సమయంలో ప్రియమణి తన భర్తకు అండగా నిలిచిందని సమాచారం. ప్రస్తుతం ప్రియమణి సినిమాల విషయానికి వస్తే డాక్టర్ -56 సినిమాలో నటిస్తున్నది. ప్రస్తుతం ప్రియమణి విడాకుల వ్యవహారంపై గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)

Read more RELATED
Recommended to you

Latest news