సీనియర్ హీరోయిన్ మరియు ఇప్పటికీ టెలివిజన్ లో ప్రసారం అయ్యే షో లకు న్యాయనిర్ణేతగా మరియు గెస్ట్ గా విచ్చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయం గురించి పంచుకున్నారు. ఈమె మాట్లాడుతూ నా కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పింది. ముఖ్యంగా బాడీ షేమింగ్ మరియు నా శరీర రంగు విషయంలో చాలా దారుణమైన కామెంట్ లను వినాల్సి వచ్చింది అని పేర్కొంది. ఇప్పటికీ నేను ఈ తరహా విమర్శలను ఎదుర్కొంటున్నట్లు ప్రేక్షకులతో పంచుకుంది. ఈమె పెళ్ళికి ముందు జరిగినా నిశ్చితార్ధ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దాని పైన కూడా ట్రోల్ చేసినట్లు చెప్పుకుంది ప్రియమణి.
నా స్కిన్ కలర్ గురించి ట్రోల్ చేశారు… అవన్నీ పట్టించుకోను: సీనియర్ హీరోయిన్
-