సీఎం ఆఫీస్ నుండి అనిల్ కుమార్ యాదవ్ కు ఫోన్…

-

నెల్లూరు రాజకీయాలు తాడేపల్లి క్యాంపు ఆఫీస్ ను తాకింది అని చెప్పాలి. ఏపీ మాజీ మంత్రి మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి పోయినప్పటి నుండి అందరూ వదిలేసిన ఒంటరిగా మారాడని చాలా బాధలో ఉన్నట్లు నిన్న చేసిన కామెంట్ ల తర్వాత అర్ధమవుతోంది. ముఖ్యంగా సొంత బాబాయ్ రూప్ కుమార్ నుండి వస్తున్న కామెంట్ లు సూటిపోటి మాటలు అనిల్ ను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ సమస్యను తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే అనిల్ కుమార్ ను సీఎం ఆఫీస్ కు పిలిపించుకున్నాడు. ఈ రోజు కాసేపటి క్రితమే అనిల్ కుమార్ యాదవ్ తన దేవుడు దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ మరియు రూప్ ల మధ్య విభేదాలపై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఫైనల్ గా జగన్ అనిల్ కుమార్ కు ఏమి చెప్పారో అన్నది తెలియాల్సి ఉంది. ఈ భేటీలోనే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ గురించి కూడా అనిల్ కు జగన్ హామీ ఇవ్వనున్నారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version