నటిగా నా ఆకలి తీరలేదు… ప్రియమణి..!

-

అందాల ముద్దుగుమ్మ ప్రియమణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లైన కొత్తలో సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ప్రియమణి ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిన ప్రియమణి ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను సాధించడం లో కాస్త డీలా పడింది. ఇది ఇలా ఉంటే ప్రియమణి కొన్ని రోజుల క్రితం విడుదలైన నారప్ప సినిమాలో నటించింది. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా ప్రియమణి టీవీ షోల ద్వారా కూడా అనేకమంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. అలాగే ప్రియమణి ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రియమణి తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో భామాకలాపం అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 11 వ తేదీ నుండి ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే తాజాగా ప్రియమణి నటిగా నాకింకా ఆకలి తీరలేదు చేయాల్సిన పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి. ఫుల్‌ లెంగ్త్ నెగటివ్ రోల్ చేయాలని కోరికగా ఉంది. ఇప్పటికే కొంతమంది కథలను కూడా వినిపించారు. చెప్పగానే కథ నచ్చితే కచ్చితంగా ఒప్పుకుంటాను అని ప్రియమణి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version