బీఆర్ఎస్, బీజేపీలకు ఎంఐఎం తమ్ముడు.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ వచ్చి దాదాపు పదేళ్లయింది.. కేసీఆర్ ఈ పదేళ్లలో ఏం చేశారని కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఇవాళ ఆమె ఆసిఫాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో మీ స్వప్నం నెరవేరిందా అని బీఆర్ఎస్ పాలనలో మీ పిల్లల భవిష్యత్ బాగుపడుతుందనే నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. రాజస్థాన్ లో తమ ప్రభుత్వం రెండు లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.

రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని.. ఉద్యమాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అర్థం చేసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఎంఐఎం తమ్ముడు అని విమర్శించారు ప్రియాంక గాంధీ. వారందరూ కలిసి నాటు నాటు డ్యాన్స్ లు వేస్తున్నారని.. వాళ్ల డ్యాన్స్ లు చూడండి.. కానీ ఓటు మాత్రం వేయకండి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర సంపదను పంచుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version