వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కావడంతో క్రికెట్ ప్రేమికులందరూ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయారు. కొన్ని అనివార్య కారణాలతో బయట ఉన్నవారు కూడా మ్యాచ్ ని మాత్రం చూడటం మానడం లేదు. మరోవైపు ఇవాళ పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో పెళ్లి మండపాల వద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్ ప్రదర్శిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా మ్యాచ్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో తొలుత శుభ్ మన్ గిల్, ఆ తరువాత రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇలా ఒకరి వెంట ఒకరు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్ లోకి వచ్చాడు. కోహ్లీని హగ్ చేసుకున్నాడు. దీంతో విరాట్ సహా అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం షాక్ కి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయటికీ తీసుకెళ్లారు. అతడు పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.