అందరూ షూటింగ్స్ ఆపాల్సిందే – నిర్మాత నట్టికుమార్ వార్నింగ్

-

నిర్మాత గిల్డ్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అందరూ షూటింగ్స్ ఆపాల్సిందేనని నిర్మాత నట్టికుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్ లో దిల్ రాజు చిత్రీకరణ ల బంద్ అన్నారు..ఛాంబర్ కూడా అన్నీ సినిమాలు ఆపేందుకు నిర్ణయించిందని గుర్తు చేశారు. కానీ నేడు బైలింగ్వెల్ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి.. దాదాపు 16 సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయని తెలిపారు.

వాటి కి వర్క్ చేసెది తెలుగు టెక్నిషియన్సేనని.. కాబట్టి అందరూ చిత్రీకరణలు ఆపాల్సిందేనని హెచ్చరించారు. దిల్ రాజు తాను చెప్పిన విషయానికి కట్టుబడి ఉండాలి..ఛాంబర్ నుంచి బంద్ పై ఒక అఫీషియల్ లేటర్ రానుందన్నారు. అందరూ ఛాంబర్ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. దీనిపై క్లారిటీ వచ్చే షూటింగ్‌ లు ఆపకపోతే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు నిర్మాత నట్టికుమార్. కాగా… ఇవాళ్టి నుంచే షూటింగ్‌ బంద్‌ అయిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version