పారితోషికం విషయంలో ఎన్టీఆర్ అలా చేశారు.. నిర్మాత అశ్వనీదత్

-

టాలీవుడ్ లో బిగ్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తాజాగా ‘సీతారామం’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకు చిత్రాలు తీసిన అశ్వనీదత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ తీస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ తో పారితోషికం విషయంలో జరిగిన ఓ గొప్ప సంఘటన గురించి తెలిపారు. ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.

సీనియర్ ఎన్టీఆర్ తో ‘ఎదురు లేని మనిషి’, ‘యుగపురుషుడు’ సినిమాలు తీసిన అశ్వనీదత్.. ‘ఎదురు లేని మనిషి’ షూటింగ్ టైమ్ లో రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ ఓ గొప్ప పని చేశారని అశ్వనీదత్ చెప్పారు. ‘ఎదురు లేని మనిషి’ చిత్రం లో కథానాయికగా వాణి శ్రీ ని ఫిక్స్ చేశారు. ఆమెకు రూ.2 లక్షలు పారితోషికం ఇచ్చిన అశ్వనీదత్ ..సీనియర్ ఎన్టీఆర్ కు అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ విషయంలో ఇవ్వాలనుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వగా, ఎన్టీఆర్.. తను కేవలం రూ.రెండు లక్షలు తీసుకుంటానని చెప్పి మిగిలిన డబ్బులు వెనక్కి ఇచ్చారని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. హీరోయిన్ తో సమానమైన రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న గొప్ప హీరో సీనియర్ ఎన్టీఆర్ అని అశ్వనీదత్ తెలిపారు.

తన బ్యానర్ కు ‘వైజయంతీ మూవీస్’ అని పేరు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అశ్వనీదత్ గుర్తు చేసుకున్నారు. అశ్వనీదత్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ ఫిల్మ్ చేస్తున్నారు. నందినిరెడ్డి దర్శకత్వంలో సంతోశ్ శోభన్ హీరోగా ‘అన్నీ మంచి శకునములే’ పిక్చర్ కూడా తీశారు. త్వరలో అది విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version