మనిషి ఒక నీచమైన జంతువు.. కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్..!!

-

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన ఈయన ప్రముఖ స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నున్వివాహం చేసుకున్నారు. ఖడ్గం సినిమాతో దేశభక్తిని కలిగించిన దర్శకుడు కృష్ణవంశీ.. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మీడియా ఛానల్ తో ముచ్చటించడం జరిగింది. స్వాతంత్రం గురించి చెప్పడంతో పాటు మనిషి ఒక నీచమైన జంతువు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.ఇక కృష్ణవంశీ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఉండే సగం దేశాలను నేను చూసాను.చాలామంది బానిసత్వాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు . ఇక అలా బ్రిటిష్ పాలన వ్యవస్థలో కూడా భారతీయులు ఉన్నారు. సైనిక వ్యవస్థలో కూడా భారతీయులు ఉన్నారు. మంగళ్ పాండే అక్కడ నుంచి వచ్చినవాడు.. మనవాళ్లు వాళ్లతో కూడా పనిచేశారు. అంతేకాకుండా మనవాళ్లు కూడా ఇంగ్లాండ్ వెళ్లి చదువుకొని వచ్చేవారు.

ఇక అలా ఇంగ్లాండుకు వెళ్లి చదువుకొని వచ్చిన వారిలో గాంధీ చంద్రబోస్ అంబేద్కర్ వీరంతా కూడా ఉన్నారు ఇక ఈ విభజన అనేది రాకూడదు అందరూ ఒకటే అనుకుంటే.. ఏ గొడవ లేదు అయితే బానసత్వం రూటు మార్చుకుంది. ఆదిమానవుడు దగ్గర నుంచి నేటి వరకు పవర్ కోసం కష్టపడాల్సిందే అనేది అనాదిగా వస్తుంది. ఇకపోతే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరుగుతున్నప్పుడే భారతదేశానికి అసలు సిసలైన స్వాతంత్రం వస్తుంది అని మహాత్మా గాంధీ అన్నారు. కానీ ప్రస్తుతం అమ్మాయిలు అర్ధరాత్రి కాదు తెల్లవారే వరకు కూడా తిరుగుతున్నారు జాబులు చేసుకుంటున్నారు.. మరి స్వాతంత్రం లేదని ఎందుకు అనుకుంటాం.. కానీ కొంతమంది వెదవలు, నీచులు, రాక్షసులు ఉంటారు.. అన్ని జంతువుల్లో కెల్లా నీచమైన జంతువు నికృష్టమైన జంతువు మనిషి మాత్రమే.

వీళ్లలో మంచి వాళ్ళు ఉంటారు.. చెడ్డవాళ్ళు ఉంటారు.. కానీ కొంతమంది నీచుల వల్ల అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అందుకే అమ్మాయిలు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన అమ్మాయిలు ఒంటరిగా వెళ్లి జాబులు చేసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version