తెలంగాణాలో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సారాంశం తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం మారబోతోంది. కేసీఆర్ కు ప్రజలు చరమగీతం పాడారంటూ సర్వేలు చాలా వరకు కాంగ్రెస్ కు అనుకూలంగా చెప్పడం జరిగింది. ఇక తాజాగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ…BRS పై తెలంగాణ ప్రజలు చాలా అసంతృత్తితో ఉన్నారన్నది వాస్తవమన్నారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య పునరుద్ధరణకే మా పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీలు మారడానికి నేతలు ప్రయత్నాలు చేస్తే నేరుగా వారి ఇంటికి వెళ్లి అక్కడ ధర్నా చేస్తామంటూ అన్ని పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు కోదండరాం. ఇక మరో రెండు రోజుల్లో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీకి షాక్ తప్పదని కోదండరాం చెప్పడం విశేషం.
మరి అందరూ అనుకుంటున్నట్లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా ?? కేసీఆర్ మరియు ఇతర బి ఆర్ ఎస్ కీలక నేతలు ఓటమి చెందితే జీర్ణించుకోవడం చాలా కష్టం అని చెప్పాలి.