ఈ రోజు రాయ్ పూర్ లో జరుగుతున్న నాలుగవ టీ 20 లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఇదే విధంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మత్యు వెడ్ బౌలింగ్ తీసుకుని ఛేజింగ్ లో ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ ను రసవత్తరంగా మార్చింది. ఇప్పుడు మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లలో ఇండియా ఒకటి గెలిచినా సిరీస్ ను సొంతం చేసుకుంటుంది.. ఒకవేళ ఇందులో ఓడితే సిరీస్ డిసైడర్ కు వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ తో పాటు ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వరుసగా మూడవ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం జరిగింది. సూర్య తన కెప్టెన్సీ తో ఆకట్టుకుంటున్నాయి ఇంకా కొన్ని చిన్న చిన్న తప్పదలను కూడా సవరించుకుంటే ది బెస్ట్ కెప్టెన్ గా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే మాజీ క్రికెటర్స్ చెప్పిన విషయం తెలిసిందే.
మరి ఈ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా ముందు ఎటువంటి టార్గెట్ ను ఉంచనుంది అన్నది తెలియాల్సి ఉంది.