బుల్లితెర యాక్టర్ తునీషా శర్మ నిన్న ఆత్మహత్య చేసుకున్నా విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఓ మ్యూజిక్ షూట్‌లో పాల్గొన్న తునీషా.. ఎవరూ లేని సమయంలో అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్‌లో తునీషా అపస్మారక స్థితిలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 20 ఏళ్ల తునీషా శర్మ బాలీవుడ్ షూటింగ్ సెట్స్‌లో ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ఈ కేసులో ఆమె సహ నటుడు షీజన్ మహ్మద్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. తునీషా ప్రముఖ టీవీ షో ‘అలీ బాబా దస్తాన్’లో నటి తునీషా శర్మ మరియా షెహజాదీగా నటించింది. ఆమె ‘భారత్ కా వీర్ పుత్ర- మహా రాణా ప్రతాప్’ అనే చారిత్రాత్మక సీరియల్‌తో టెలివిజన్‌కు పరిచయమైంది.
ఆ తర్వాత, ఆమె చక్రవర్తి అశోక్ సామ్రాట్, గబ్బర్ పూంచ్‌వాలా, షేర్-ఎ-పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్, ఇంటర్నెట్‌వాలా లవ్, ఇష్క్ శుభనాల్లా సీరియల్‌లలో కనిపించింది. టీవీ సీరియల్స్‌తో పాటు, ఆమె ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2, దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 వంటి సినిమాల్లో నటించింది. దబాంగ్ 3లో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రలో నటించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఆరు గంటల ముందు, తునీషా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సెట్స్ నుండి వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో, ఆమె సెట్‌లో షూటింగ్ కోసం మేకప్ చేస్తూ కనిపించింది. సెట్‌లో ఈ తెరవెనుక వీడియోకు ఆమె ‘స్టే ట్యూన్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.