ఉద్యోగాల భర్తీ విషయంలో పురోగతి తెలపాలి: ఏపీ హైకోర్టు

రాష్ట్ర వినియోగదారుల కమిషన్​లో మహిళా సభ్యురాలు పోస్టుతో పాటు జిల్లా వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న అధ్యక్షులు, సభ్యులు, మహిళా సభ్యుల పోస్టుల భర్తీ విషయంలో పురోగతి తెలపాలని ఆధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నెల రోజులకు వాయిదా వేసింది.

ap hight court
ap hight court

వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని న్యాయవాది చలసాని అజయ్ కుమార్ దాఖలు చేసిన పిల్​పై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి. కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వినియోగదారుల కమిషన్​లో ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఆధార్టీని ఏర్పాటు చేయాల్సి ఉందని జీపీ బదులిచ్చారు. భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. చర్యల్లో పురోగతి వివరాల్ని తెలపాలని ఆదేశాలు జారీచేసిన ధర్మాసనం… తదుపరి విచారణ నెల రోజులకు వాయిదా వేసింది.