బెల్ బెంగుళూర్‌లో ప్రాజెక్టు ఇంజ‌నీర్‌ ఉద్యోగాలు… వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బెంగుళూరుల ఉన్న భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ ని కూడా విడుదల చెయ్యడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

 

jobs

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 07 ప్రాజెక్టు ఇంజ‌నీర్లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులకు రూ.50,000 జీతం అందించ‌నున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పరీక్ష ఉండదు. ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థులను అకాడ‌మిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన‌ అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థుల అకాడ‌మిక్ సామ‌ర్థ్యం, అనుభమే ఎంపికకు ముఖ్యం. అకాడ‌మిక్ మార్కుల‌కు 75 శాతం వెయిటేజ్ ఉంటుంది. అనుభ‌వానికి 10 శాతం మార్కులు. అలానే ఇంట‌ర్వ్యూకి 15 శాతం మార్కులు ఉంటాయి.

అలానే ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 8, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రాజెక్టు ఇంజ‌నీర్ పోస్టులు ఖాళీ వున్నాయి. బీఈ/ బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను చూసి పూర్తి వివరాలని తెలుసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version