‘ఆర్ఆర్ఆర్’లో ఆ సీన్స్ ఏవి.. అభిమానుల అంసతృప్తి..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ప్రపంచంలోనే గొప్ప దర్శకుడు రాజమౌళి అని కొనియాడుతున్నారు. ఇక ఈ చిత్రానికి వసూళ్ల పర్వం కొనసాగుతోంది. రికార్డు వసూళ్లు చేస్తూ ఇంకా ముందుకు సాగుతోంది సినిమా.

ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫార్మెన్స్ , సీన్ ఎలివేషన్స్ చూసి ఫ్యాన్ హ్యాపీగానే ఉన్నారు. కానీ, వీరిరువురి టీజర్స్ రిలీజ్ సందర్భంగా వచ్చిన సన్నవేశాలను సినిమాలో పెట్టకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విడుదల కు ముందర విడుదల చేసిన పాత్రల ఫస్ట్ లుక్ లు అనగా.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ గురించి విడుదల చేసిన ప్రోమోలు సినిమాలో లేవు.. ఒకరి గురించి మరొకరు అనగా రామ్ చరణ్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలా ప్రోమోలలో అత్యద్భుతంగా కనబడిన సన్నివేశాలు సినిమాలో లేవు. అయితే, రాజమౌళి కేవలం పాత్రల పరిచయం కోసమే అలా చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రోమోలలో చూపించిన అత్యద్భుతమైన షాట్స్, సీన్స్ సినిమాలో లేకపోవడం పట్ల పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, అవన్నీ షాట్స్ కనుక చిత్రంలో ఉండి ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఇంకా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

పిక్చర్ చూస్తున్న క్రమంలో అభిమానులు ప్రోమోలో చూపించిన సీన్స్ ఎక్కడ కనబడుతాయా? అని ఎదురు చూశారు. కానీ, అవి ఎక్కడా కనబడలేదు. అయితే, బహుశా సినిమా ఎడిటింగ్ లో అవి పోయి ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఇప్పటికే చిత్ర నిడివి మూడు గంటలు ఉండగా, అవి కూడా యాడ్ చేస్తే ఇంకా లెంగ్త్ పెరిగేదని అభిప్రాయపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version