గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన పోలీసుల దాడిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు.. స్నేహితుల ద్వారా మొబైల్ ఫోన్లలో యువతులను ఎరవేసి విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.